
Trump Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలో స్కైలైన్‌లో మరో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. కోకాపేట్‌లో ట్రంప్ బ్రాండ్‌తో నిర్మించనున్న భారీ టవర్స్ ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారాయి. రెండు ఎత్తైన టవర్లను కలుపుతూ ప్రత్యేకమైన స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుమారు 242 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఈ టవర్స్ హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త రూపాన్ని తీసుకురానున్నాయి. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నగరంలోని ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగు పెట్టింది. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డైవలపర్స్ హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును నిర్మాణం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కోకాపేట్ గోల్డెన్‌మైల్ రోడ్డులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో మొత్తం రెండు టవర్లను అభివృద్ధి చేస్తున్నారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఈ టవర్స్‌లో మొత్తం 16 పెంట్‌హౌస్‌లతోపాటు 450 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి ధరను మినహాయించి రూ.1,700 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి తెలిపారు. ఈ టవర్స్ భారతదేశంలో ఎనిమిదో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టు. అయితే, దక్షిణ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది కావడం విశేషం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 2031వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ భారత మార్కెట్లోకి 2014లో అడుగు పెట్టింది. ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సంస్థ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణ పనులు