హైదరాబాద్ లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్ బ్యాండ్ బాజాయించిన యువతి
Actor ProfileCelebrity

హైదరాబాద్ లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్ బ్యాండ్ బాజాయించిన యువతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్ బ్యాండ్ బాజాయించిన యువతి
Asianet News Telugu1 Dec 2026
హైదరాబాద్ లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్ బ్యాండ్ బాజాయించిన యువతి

హైదరాబాద్ నగరం అనగానే చారిత్రక కట్టడాలు, సందడి ప్రదేశాలు గుర్తుకొస్తాయి. అయితే, అదే చార్మినార్ ప్రాంతంలో రాత్రి వేళ ఒక విచిత్రమైన, కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయం.. కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న సిద్ధేశ్వరి సుగంధ్ (సిద్ధి) అనే యువతి చార్మినార్ పరిసర ప్రాంతంలో ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. చలిగా ఉండటంతో కుర్తీ, షాల్ కప్పుకుని నిలబడి ఉన్న ఆమె దగ్గరకు ఓ వ్యక్తి స్కూటర్‌పై వచ్చి ఆగాడు. "మ్యామ్.. ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా? డ్రాప్ చేయమంటారా?" అంటూ చాలా నమ్మకంగా మాట కలిపాడు. ఆ వ్యక్తి అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడేసరికి సిద్ధేశ్వరి వెంటనే అప్రమత్తమైంది. అసలు తాను ఎలాంటి రాపిడో రైడ్ బుక్ చేసుకోకుండా ఇతను నేరుగా వచ్చి ఎలా అడుగుతున్నాడా అని సందేహించింది. వెంటనే ఆమె తన మొబైల్‌లో రికార్డింగ్ ఆన్ చేసి, అతడి వాహనాన్ని గమనించింది. విచిత్రమేమిటంటే ఆ స్కూటర్‌కు కనీసం వెహికల్ నంబర్ ప్లేట్ కూడా లేదు. "బండికి నంబర్ ఏది? నీ రాపిడో డ్రైవర్ ఐడీ కార్డు చూపించు" అని సిద్ధి గట్టిగా నిలదీసింది. దాంతో ఆ వ్యక్తి కంగారుపడుతూ నీళ్లు నమగడం మొదలుపెట్టాడు. ఐడీ కార్డు చూపించమంటే.. అప్పటికప్పుడు తన ఫోన్‌లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి రాపిడో యాప్ డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. తన పేరు ఇర్ఫాన్ అని చెప్పిన ఆ వ్యక్తి, క్రెడెన్షియల్స్ చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, విచిత్రంగా "బండి స్టార్ట్ కావడం లేదు మేడమ్" అంటూ సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. అసలు స్టార్ట్ కూడా కాని బైక్ పెట్టుకుని, ఎలాంటి బుకింగ్ లేకుండా ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఎలా వస్తావని ఆమె తీవ్రంగా మండిపడింది. అతడి ఫోన్ స్క్రీన్ చూస్తే అప్పుడే ఓటీపీ అడిగే లాగిన్ పేజీ కనిపిస్తోంది. అతడు అసలు రాపిడో డ్రైవరే కాదు

హ దర బ ద ల క త త ట ప ఫ ర డ ఫ క ర ప డ డ ర వర బ య డ బ జ య చ న య వత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in