హైదరాబాద్ లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్
Actor ProfileCelebrity

హైదరాబాద్ లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్
HMTV1 Jan 2027
హైదరాబాద్ లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్ హైదరాబాద్: చట్టవిరుద్ధంగా మెఫెంథెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ సిటీ, రాజేంద్రనగర్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం (15.08.2026) అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో దాడి నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ బృందం, మహమ్మద్ ఐజాజ్ (23) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించింది. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ 'ఇండియా మార్ట్' (IndiaMART) ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, థర్డ్ పార్టీ కొరియర్ సేవల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తేలింది. సుమారు ₹5,000 లకు 30 ఇంజెక్షన్ల ప్యాక్‌ను కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌ను ₹1,000 చొప్పున విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. జుబేర్ సూచనల మేరకు మహమ్మద్ సైఫ్ ఖాన్ ఈ ఇంజెక్షన్లను సరఫరా చేయగా, మహమ్మద్ ఐజాజ్ వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఐజాజ్ (23): వృత్తి: చార్మినార్ KPB కాంప్లెక్స్‌లోని దుస్తుల దుకాణంలో పని, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (ఇంజెక్షన్ల విక్రేత). (గతంలో సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, బహదూర్ పురా, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లలో 5 కేసుల్లో నిందితుడు). మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ (30): వృత్తి: మోడలింగ్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (గతంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది). మహమ్మద్ సైఫ్ ఖాన్ (20): వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. శుభమ్ రాజ్‌పుత్: నివాసం: రాజస్థాన్. (ముఖ్య సరఫరాదారు — పరారీలో ఉన్నాడు). 110 మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్ (Vails) (మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 6,00,000/- గా అంచనా). రాజేంద్రనగర్ మరియు శంషాబాద్ జోన్ల అదనపు డిసిపి కె.ఎస్. రావు

హ దర బ ద ల అక రమ ఇ జ క షన ల వ క రయ మ గ గ ర అర స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in