హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
Actor ProfilePolitician

హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
Andhra Jyothy26 Jan 2027
హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని తనిఖీ చేయగా.. తొలుత నాలుగు కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. విచారణలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి మద్యం తీసుకున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. దాదాపు 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 55 కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఒక్కో బాటిల్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు లాభం పొందుతున్నట్లు తేలింది. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అమీర్‌పేట్ ఎక్సైజ్ సీఐ బానోత్ పటేల్ వెల్లడించారు. అన్నవరం బస్టాండ్‌‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు