
Rating:2.5 ---సూర్య ప్రకాష్ జోశ్యుల ప్రేమలో పడటానికి పెద్దగా ప్రయత్నాలు అక్కర్లేదు. కాస్త ఖాళీ ఉంటే చాలు. సెల్ ఫోన్ ప్రక్కన పెట్టి కాసేపు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలని గమనిస్తే చాలు. వాళ్ళలో ఎవరైనా నచ్చచ్చు.ఏదో ఒక క్వాలిటీ నచ్చేయచ్చు.ఆ విషయం మనం అర్దం చేసుకునే సిగ్నల్స్ కూడా శరీరం ఏర్పాటు చేస్తుంది. గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. మెదడు కొంచెం తక్కువగా పనిచేస్తుంది. అంతే... ప్రేమ మొదలవుతుంది. అయితే ప్రేమలో పడినంత ఈజీ కాదు..అవతలి వాళ్లను ప్రేమలో పడేయటం. అంతకన్నా ముందు వాళ్ల దగ్గర ప్రేమ విషయం ఎక్సప్రెస్ చేయటం.ప్రస్తుతం హృదయ (అధర్వ) పరిస్ధితి అదే. హృదయ అదే పనిగా అమ్మాయిలను వరసపెట్టి ప్రేమించగల సత్తా ఉన్నవాడే. సమస్య ఏంటంటే... అతను ప్రేమించే అమ్మాయికి తప్ప అందరికీ ఆ విషయం తెలుస్తుంది.అలాగే అతను పైన చెప్పుకున్నట్లు సదరు అమ్మాయికి ఎదురుపడి..హౌడుయు డు అన్నట్లుగా నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పలేని బెరుకుతనంతో బాధపడుతూంటాడు. అందులో రీజన్ కూడా ఉంది. చిన్నప్పుడే అమ్మా,నాన్న దూరం అవ్వటంతో హృదయను మేనమామ (నట్టి సుబ్రమణ్యం) పెంచి పెద్ద చేస్తాడు. ఆ లోటు అతనిలో ఒక రకమైన భయాన్ని పెంచుతుంది. ఎవరినైనా దగ్గర చేసుకోవడం కంటే, వాళ్లు దూరమైపోతారేమోనని ముందే భయపడటం అతని స్వభావంగా మారుతుంది. అందుకే స్కూల్‌లో టీచర్ గీతపై క్రష్ వచ్చినా అది క్రష్‌గానే మిగిలిపోతుంది. ఆ తర్వాత కాలేజ్‌లో సమంత (ప్రీతి ముకుందన్)వస్తుంది. ఆమె గురించి ఆలోచిస్తాడు. ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నాడని ఫ్రెండ్స్‌కి చెబుతాడు. ఒక్క సమంతకి మాత్రం చెప్పడు.దాంతో ఆమె మిస్. సర్లే ప్రపంచంలో ఒక్కరే అమ్మాయా..ఈ సారి 'అముద' (కయాదు లోహార్)అనే డాక్టర్ కనపడితే, ప్రేమలో అమాంతం పడిపోయి,ఆరాధిస్తూంటాడు. సర్లే ఈ సారి అయినా తన ప్రేమ విషయం చెప్తాడా అంటే..సేమ్ సీన్ రిపీట్. ఫ్రెండ్స్ పాపం తెగ బ్రతిమిలాడి అలిసిపోతారు కానీ ఫలితం లేదు. మనోడికి ప్రేమలు అచ్చొచ్చేలా లేవని