హాట్ స్పాట్ ’ కెమెరా
Actor ProfileCelebrity

హాట్ స్పాట్ ’ కెమెరా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హాట్ స్పాట్ ’ కెమెరా
Eenadu30 Oct 2026
హాట్ స్పాట్ ’ కెమెరా

సాధారణంగా కెమెరా అంటే మన కంటికి కనిపించే రంగుల ప్రపంచాన్ని బంధిస్తుంది. కొత్తగా మన కంటికి కనిపించని ఉష్ణాన్ని రంగుల్లో చూపించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకొని వాడే ఈ థర్మల్‌ కెమెరా(ఫ్లూక్‌ ఐసీ) ఒక గ్యాడ్జెట్‌గానే కాక భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా స్మార్ట్‌ఫోన్‌కు కింద చిన్న కెమెరాను అమర్చడం ద్వారా చుట్టుపక్కల ఉన్న వస్తువుల ఉష్ణోగ్రతలను క్షణాల్లో స్క్రీన్‌పై చూడొచ్చు. ఎక్కువ వేడి ఉన్నచోట ఎరుపు, పసుపు రంగుల్లో, చల్లగా ఉన్నచోట ఊదా, నీలం రంగుల్లో ప్రత్యేక యాప్‌లో చూపిస్తుంది. దీంతో ఇళ్లలో లేదా పరిశ్రమల్లో ఏ వైరింగ్‌ లీక్‌ అవుతోంది, ఏ స్విచ్‌బోర్డు ఓవర్‌ హీట్‌ అవుతుందనేది షార్ట్‌సర్క్యూట్‌ కాకముందే పసిగట్టవచ్చు. గోడల లోపల ఉండే పైపుల్లో వేడినీరు లీకవుతుంటే గోడలు పగులగొట్టకుండానే గుర్తించవచ్చు. శనివారం ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ వద్ద టీజీఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో సురక్ష 2026 స్టాల్స్‌లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం పరిశ్రమలు, విద్యుత్‌ సంస్థలు, సాంకేతిక నిపుణులు విస్తృతంగా ఈ పరికరం వినియోగిస్తున్నారని, రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి వస్తుందని ధర సుమారు రూ.28 వేలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హ ట స ప ట క మ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in