సివిల్స్ అభ్యర్థులకు బంపరాఫర్..అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ.. రూ.లక్ష ప్రోత్సాహకం
Actor ProfilePolitician

సివిల్స్ అభ్యర్థులకు బంపరాఫర్..అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ.. రూ.లక్ష ప్రోత్సాహకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సివిల్స్ అభ్యర్థులకు బంపరాఫర్..అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ.. రూ.లక్ష ప్రోత్సాహకం, అర్హతలు.. పూర్తి వివరాలివే
Zee Telugu31 Oct 2026
సివిల్స్ అభ్యర్థులకు బంపరాఫర్..అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ.. రూ.లక్ష ప్రోత్సాహకం, అర్హతలు.. పూర్తి వివరాలివే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rajiv Gandhi Civils Abhaya Hastham: తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం ఈ ఏడాది కూడా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్ ను కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్ కు అర్హత సాధించిన తెలంగాణ ప్రాంతాల్లోని అభ్యర్థుల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ సింగరేణి సంస్థ తరపున రూ. 1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని.. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి ఈ ఆర్థిక ప్రోత్సాహాకాన్ని అందిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. సింగరేణి అందిస్తున్న ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలని రాష్ట్రానికి దేశానికి సేవలందించాలని డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో యువత సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కీమును 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయడంలో భాగంగా, 2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన