సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం
Actor ProfileActor

సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం
Chitrajyothy27 Oct 2026
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం

వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి (Mahanati Savitri) 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ (Sanjay Kishore) రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణి జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అందజేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ.. సావిత్రమ్మ ప్రాత:స్మరణీయులు కారు.. చిరస్మరణీయులు. కొంత మంది పుడతారు.. భగవంతుడు కొంత మందిని పుట్టిస్తాడు. అలాంటి వారిని కారణజన్ములు అంటారు. అలాంటి వారిలో సావిత్రమ్మ ఒకరు. ఎంతో మంది మహానుభావులు జన్మించిన ఈ గడ్డపై సావిత్రమ్మ జన్మించడం మన అదృష్ణం. ఆ తల్లి కోటానుకోట్ల హావభావాల్ని అందించారు. ఆమె గంధర్వుల్లాంటి వారు. ఆమె అద్భుతాలకే అద్భుతం. అలాంటి వారికి మరణం ఉండదు. ఆమెతో ఒక్క సినిమా అయినా నటిస్తే బాగుండు కదా? అనే కోరిక ఉండేది. ఆమెతో నటించే భాగ్యం నాకు దక్కలేదు. ఆమెను స్మరించుకోని తెలుగు వారు, తెలుగు జాతి ఉండదు. ఒక్క సెకనులో మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌లో ఇచ్చే మహానటి సావిత్రి. అలాంటి సావిత్రమ్మ పై పుస్తకాలు రాస్తున్న కిషోర్‌కు ధన్యవాదాలు. తల్లి రుణాన్ని తీర్చుకుంటున్న చాముండేశ్వరి జీవితం చరితార్థం అవుతుంది. ఈ పుస్తకం, ఆ ముఖచిత్రం చూసి నా కంట్లోంచి నీరు వచ్చేసింది