స్వాతంత్ర వేడుకల్లో ఏపీ మంత్రికి అస్వస్ధత..! కళ్లు తిరిగి పడిపోయి
Actor ProfilePolitician

స్వాతంత్ర వేడుకల్లో ఏపీ మంత్రికి అస్వస్ధత..! కళ్లు తిరిగి పడిపోయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్ర వేడుకల్లో ఏపీ మంత్రికి అస్వస్ధత..! కళ్లు తిరిగి పడిపోయి
Oneindia Telugu23 Dec 2026
స్వాతంత్ర వేడుకల్లో ఏపీ మంత్రికి అస్వస్ధత..! కళ్లు తిరిగి పడిపోయి

దేశమంతా స్వాతంత్ర వేడుకల్ని అట్టహాసంగా జరుపుకుంటోంది. ఏపీలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులంతా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొంటున్నారు. పతాకావిష్కరణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమికి తాళలేక కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా కంగారు పడ్డారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!తిరుపతి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో ఇవాళ జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎప్పటిలాగే పతాకావిష్కరణ తర్వాత ఆనం ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. ప్రసంగం కూడా ప్రారంభించారు. ఉన్నట్లుండి ఆయనకు కళ్లు తిరగడంతో ప్రసంగాన్ని ఆపేశారు. వెంటనే కుప్పకూలిపోతుండగా.. పక్కనే ఉన్న పోలీసులు, అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు పంద్రాగస్టు కానుక- మరో కొత్త పథకం..!మంత్రి ఆనం అస్వస్థతకు గురికావడంతో పరేడ్ గ్రౌండ్ లో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకొని పక్కన కూర్చోబెట్టారు. అనంతరం వెంటనే డాక్టర్లను పిలిపించారు. వారు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం మంత్రి ఆనం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, పరేడ్ మైదానంలో వేడుకలకు హాజరైన వారంతా ఊపిరిపీల్చుకున్నారు