
Eenadu•21 Jan 2027
స్వాతంత్ర్య సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోందివందేమాతరం విషయంలో భాజపా, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న పోరు నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ 1936-37 తీర్మానానికి అనుగుణంగా వందేమాతరం పూర్తిగా పాడమంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం దేశ విభజనకు దోహదపడిన ఒక చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేయడమేనని షా అన్నారు. వందేమాతరం పూర్తిగా పాడకుండా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తోందని విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది: అమిత్ షా