స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను
Actor ProfilePolitician

స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను
Eenadu25 Dec 2026
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందంటున్నారు యూపీలోని లఖ్‌నవూకు చెందిన ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి సతీమణి. దేశానికి ప్రస్తుతం ఎంత వయసుందో తనకూ అంతే వయసంటూ చెబుతున్నారు. ఎందుకంటే.. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే తానూ జన్మించానని చెప్పారు. ‘‘బ్రిటిష్ వలస పాలన ముగింపును సూచిస్తూ.. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తున్న సమయంలోనే వారణాసిలో పుట్టాను. అందుకే నాపేరు ‘విజయ’ కుమారి అని పెట్టారు. నా పుట్టిన రోజును దేశం మొత్తం సంబరంలా జరుపుకొంటారని చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చెప్పేవారు. పెద్దయ్యాక దేశానికి సేవ చేసే సైనికుడిని వివాహం చేసుకున్నా. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో ఓ పేలుడు ఘటనలో ఆయన ఒక కాలును కోల్పోయారు. అయినప్పటికీ ఆయన చూపిన పరాక్రమానికి ప్రభుత్వం ఆయనను ‘వీరచక్ర’తో సత్కరించింది. ఆయనే మేజర్‌ ధీరేంద్ర నాథ్ సింగ్. దేశంపై ఉన్న ప్రేమతో 1966లో కృత్రిమ కాలు అమర్చుకొని మరీ లఖ్‌నవూలో విధులు నిర్వర్తించేవారు. కొన్నాళ్లకు వైద్యపరంగా అనర్హులుగా (medically unfit) ప్రకటించి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. అయినప్పటికీ మేము బాధ పడలేదు. మా ఇద్దరు కుమారులను ఆర్మీలో చేర్పించాం. ఒక మనవడు ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తుండగా.. మరో మనవడు శిక్షణ పొందుతున్నాడు. గతేడాది నా భర్త చనిపోయారు. నా కుటుంబం అంతా దేశసేవలోనే గడుపుతోంది’’ అని ఆమె తన జీవితగాథను గుర్తుచేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి