
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈసందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు (Independence Day). దేశం కోసం త్యాగాలు చేసిన అమరవీరులకు, నాయకులకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాళులు అర్పించారు. మనమంతా బాధ్యతతో వ్యవహరించాలన్నారు. దేశ పురోగతి, సాధించిన విజయాలను ప్రస్తావించారు. రక్షణ రంగం బలపడటం, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం వంటి అంశాలను పవన్ పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక విభేదాలకు అతీతంగా ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కొరియన్ కనకరాజు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు వరుణ్ తేజ్