స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్' .. వివాదంలో స్కూల్ యాజమాన్యం
Actor ProfilePolitician

స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్' .. వివాదంలో స్కూల్ యాజమాన్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్' .. వివాదంలో స్కూల్ యాజమాన్యం
Zee Telugu15 Jan 2027
స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్' .. వివాదంలో స్కూల్ యాజమాన్యం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Burqa Dance Controversy: యూపీలో ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినులు బర్ఖాలు ధరించి చేసిన నృత్యం పెను వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారడంతో పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్ మెంట్ బహిరంగంగా క్షమాపణలు కోరింది. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితో గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరిగింది. వేడుకల్లో భాగంగా బుర్ఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్ పురి, హర్యాన్వీ, బాలీవుడ్ పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేశ్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఏ మతాన్ని వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. డ్యాన్స్ చేసిన విద్యార్థులందరూ కూడా హిందూమతానికి చెందినవారేనని..కేవలం సరదా కోసమే అలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. జరిగిన పొరపాటునకు నేను చింతిస్తున్నాను.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం అవ్వగుండా చూసుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు