
Andhra Jyothy•22 Dec 2026
స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీ, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. దీనికి జతగా తెల్లటి కుర్తా, గోధుమ రంగు కలిగిన కోట్‌ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు