స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు
Actor ProfileActor

స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు, అనుష్క శెట్టి పేరు వెనుక టాప్ సీక్రేట్ ఏంటో తెలుసా
Asianet News Telugu25 Oct 2026
స్వీటీ శెట్టిని అనుష్కగా మార్చిన హీరో ఎవరు, అనుష్క శెట్టి పేరు వెనుక టాప్ సీక్రేట్ ఏంటో తెలుసా

టాలీవుడ్‌లో ‘జెజమ్మ’గా, ‘దేవసేన’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలకైనా ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె పేరు అనుష్క కాదు. కర్ణాటకకు చెందిన ఈ మంగళూరు భామ అసలు పేరు 'స్వీటీ శెట్టి'. మరి ఈ స్వీటీ శెట్టి స్క్రీన్ నేమ్ 'అనుష్క'గా ఎలా మారింది? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగళూరులో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ఆమె అందం, వ్యక్తిత్వం చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, తను తెరకెక్కించబోయే 'సూపర్' సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, వెండితెరకు పరిచయం చేసేటప్పుడు 'స్వీటీ' అనే పేరు కంటే క్యాచీగా ఉండే మరో పేరు పెడితే బాగుంటుందని మూవీ టీమ్ అనుకున్నారట. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఓ పాటకు పాపులర్ గాయని అనుష్క మంచందా పాడారు. 'సూపర్' సినిమా ఆడిషన్స్ , ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు చిత్ర యూనిట్ ఆ పాటను వినడం , ఆ పేరును గమనించడం జరిగింది. 'అనుష్క' అనే పేరు చాలా కొత్తగా, పలకడానికి వినసొంపుగా అనిపించడంతో.. కింగ్ నాగార్జున, పూరీ జగన్నాథ్ కలిసి స్వీటీ శెట్టికి 'అనుష్క శెట్టి' అనే స్క్రీన్ నేమ్ ఖరారు చేశారు. సూపర్' సినిమా టైటిల్ కార్డ్స్ లో ఆమె పేరు అనుష్కగా పడింది. ఆ పేరు ఆమెకు బాగా కలిసి వచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి వంటి చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. పేరు మారినా, ఇండస్ట్రీలోని సన్నిహితులు, అభిమానులు ఇప్పటికీ ఆమెను ప్రేమగా

స వ ట శ ట ట న అన ష కగ మ ర చ న హ ర ఎవర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in