
దేశభక్తికి భాష అవసరం లేదు.. గుండెల్లో దేశం ఉంటే చాలు. జాతీయ గీతం వినిపించకపోయినా ప్రతి హృదయంలో మార్మోగొచ్చు. మాటలు పలకలేని చిన్నారులు చేతులతో ‘జనగణమన’ను ఆవిష్కరించిన ఆ క్షణం.. దేశభక్తికి కొత్త అర్థం చెప్పింది. దాదాపు 500 మంది చిన్నారులు ఒక్కసారిగా తమ చేతులను కదిలిస్తుంటే.. సంగీతం, శబ్దం లేకపోయినా దేశభక్తి మార్మోగింది. ప్రతి కదలికలో భారత్ కనిపించింది. ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించిన ఆ మౌన గీతం.. దేశభక్తికి అసలు స్వరం హృదయమేనని చాటిచెప్పింది.ముద్రా గ్రూప్.. బిగ్ సినిమాస్ కోసం 2011లో రూపొందించిన ‘ది సైలెంట్ నేషనల్ ఆంథమ్’ ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ఆలోచన ఉంది. ‘‘దేశభక్తికి భాష లేదు’’ అంటూ బాబీ పవార్ ఆలోచన నుంచి ఈ ప్రయోగం పుట్టింది. సాధారణంగా జాతీయ గీతాన్ని వింటాం. కానీ ఈసారి దాన్ని వినకుండా చూడాల్సి వచ్చింది. వినికిడి, మాటల లోపం ఉన్న చిన్నారులు సంకేత భాషలో ‘జనగణమన’ను ప్రదర్శించారు.ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలల్లోని దాదాపు 500 మంది చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి చిన్నారి చేతి కదలికలో ఓ భావం కనిపించింది. ప్రతి చూపులో ఓ గర్వం ప్రస్పుటమైంది. ప్రతి సంకేతంలో ‘నేను భారతీయుడిని’ అనే మాట వినిపించింది. వారి గొంతులు వినిపించకపోయినా.. వారి దేశభక్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. థియేటర్‌లో ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.ఈ ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు లేవు. భారీ హంగులు లేవు. కేవలం నిర్మలమైన చిన్నారులు.. నిజమైన