సిరిసిల్లలో.. జానకి బాల్యం
Actor ProfileCelebrity

సిరిసిల్లలో.. జానకి బాల్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిరిసిల్లలో.. జానకి బాల్యం
Eenadu30 Oct 2026
సిరిసిల్లలో.. జానకి బాల్యం

మానేరులో ఆటాపాటలు ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా ఆమె తండ్రి సేవలు ఈనాడు, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు గర్వంగా చెప్పుకొనేలా జానకి బాల్యం సిరిసిల్లతో ముడిపడి ఉంది. ఆమె చిన్నతనంలో ఆరేళ్లపాటు పట్టణంలో ఉన్నారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి తెలుగు ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో వారు వేంకటేశ్వర ఆలయం సమీపంలో తిమ్మయ్యగారి బంగ్లాలో అద్దెకు ఉండేవారు. అక్కడ ఉన్నన్ని రోజులు స్థానిక నేత కుటుంబాలతో సన్నిహితంగా ఉండేవారు. చుట్టుపక్కల వారితో కలిసి మానేరు వాగులో పాటలు పాడుతూ ఆటలు ఆడుకున్న సందర్భాలను జానకి పలుమార్లు, పలు వేదికలపై గుర్తు చేసుకున్నారు. వేములవాడకు ఎడ్లబండిపై వెళ్లి సినిమాలు చూసివచ్చినట్లు చెప్పేవారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలోనూ పలు సందర్భాల్లో పాటలు పాడినట్లు తెలిపారు. సినీ రంగంలో విశేష గుర్తింపు పొందిన తర్వాత కూడా ఆమె వేములవాడను సందర్శించారు. 2001లో సిరిసిల్ల పట్టణంలోని పలువురు రచయితలు ‘సిరి వెలుగుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జానకమ్మని ఆహ్వానించినట్లు నేషనల్‌ బుక్‌ ట్రస్టు ఎడిటర్‌ పత్తిపాక మోహన్‌ చెప్పారు. ఆ సమయంలో వీలుపడక, మరో సందర్భంలో సిరిసిల్లకు వచ్చారన్నారు. అప్పుడు ఆమెను సన్మానించినట్లు తెలిపారు. జానకి చిన్నతనంలో సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ భూపోరాటాలు ఎక్కువగా జరిగేవి. దీంతో వాళ్ల నాన్న కుటుంబంతో సహా చెన్నై వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

స ర స ల లల జ నక బ ల య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in