సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ
Actor ProfilePolitician

సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ
Namasthe Telangana25 Dec 2026
సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ

బూర్గంపహాడ్, ఆగస్టు 15 : 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని అంజనాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ తేజావత్ జానకిరామ్ సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో బూర్గంప‌హాడ్‌ మండలంలోని అంజనాపురం ఎంపీపీఎస్, మోరంపల్లిబంజర్ జడ్పీహెచ్ఎస్, ప్రైమరీ, బుడ్డగూడెం, జింకలగూడెం, నకిరిపేట, పోలవరం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,000 నోటు పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకుడు జానకిరామ్ మాట్లాడుతూ ట్రస్ట్‌ ద్వారా విద్యార్ధుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్ధికి నాణ్యమైన విద్యకు ప్రోత్సాహం, యువతలో ప్రతిభ, నాయకత్వం, అవకాశాలను పెంపొందించడం, మహిళలకు ఆత్మ విశ్వాసం, స్వావలంబన, అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవడం అనే లక్ష్యాలతో ట్రస్టు ముందుకు సాగుతుందని, ఈ అంశాలపై ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాణావత్ మురళీకృష్ణ, తేజావత్ సీతారాములు, బానోత్ హుస్సేన్ నాయక్, భూక్యా దివ్యశ్రీ, భూక్యా సీతారాంనాయక్, శ్యామ్ రాథోడ్, భూక్యా మురళి, చంటి, వినోద్, గాంధీ, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

స ర య మ మ ర యల ఫ డ షన ఆధ వర య ల న ట ప స తక ల ప ప ణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in