సూర్య గ్రహణం వేళ ఆలయాల ద్వారాలను ఎందుకు మూసివేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి
Actor ProfilePolitician

సూర్య గ్రహణం వేళ ఆలయాల ద్వారాలను ఎందుకు మూసివేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూర్య గ్రహణం వేళ ఆలయాల ద్వారాలను ఎందుకు మూసివేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి
Samayam Telugu5 Dec 2026
సూర్య గ్రహణం వేళ ఆలయాల ద్వారాలను ఎందుకు మూసివేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని అశుభానికి ప్రతీకగా భావిస్తారు. పురాణాల ప్రకారం, సూర్య,చంద్రులను రాహు, కేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని పండితలు చెబుతారు. గ్రహణం సమయంలో భూమిపై నేరుగా అతి నీల లోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం, గ్రహణాల సమయంలో సూర్య, చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ప్రతికూల ప్రభావం ఆలయంలో ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం, అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో అసురులకు అమృతం దొరుకుతుంది. ఈ విషయం పసిగట్టిన శ్రీహరి మోహినీ అవతారంలో వెళ్లి రాక్షాసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు. ఇది కనిపెట్టిన రాహువు-కేతువులు కూడా సూర్య చంద్రుల మధ్య కూర్చుంటారు. ఇదే విషయాన్ని సూర్య చంద్రులు విష్ణువుకు వివరిస్తారు. రాహువు, కేతువుల కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. అయితే శ్రీ మహా విష్ణువు వారి శిరస్సులను ఖండిస్తాడు. వారు అమృతం స్వీకరించడంతో వారి తల భాగం అమరత్వంతో ఉండిపోతుంది. వారి శరీరం నశించిపోతుంది. తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్య చంద్రులను రాహు, కేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యుడు, చంద్రుడు కనిపించని ఆ కాలాన్ని చెడు కాలంగా పరిగణిస్తారు. దీంతో రాహువు