‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్ మీట్ లో సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. దీంతో, వీరిద్దరి కలయికలో

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్ మీట్ లో సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. దీంతో, వీరిద్దరి కలయికలో

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘సంజయ్ విశ్వనాథ్’గా సూర్య కనబరిచిన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినా సరైన స్క్రిప్ట్ కుదరక సాధ్యపడలేదని, త్వరలోనే ఆయనను మెప్పించే కథతో సినిమా చేస్తానని త్రివిక్రమ్ వెల్లడించారు. తన భార్య సూర్యకు పెద్ద అభిమాని అని, ఏ సెట్స్‌కు రాని ఆమె సూర్యను కలిసేందుకే ప్రత్యేకంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్‌కు వచ్చిందని సరదాగా పంచుకోగా, సూర్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు