సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను
Actor ProfileActor

సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను
TV9 Telugu27 Dec 2026
సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు