
మెగాస్టార్ చిరంజీవిలో పట్టుదల, ఏదో సాధిస్తాడన్న నమ్మకం, ముఖ్యంగా మంచి వ్యక్తిత్వం ఉంది అన్న కారంగా తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య. చిరంజీవి కూడా ఆ నమ్మకాన్ని ఇప్పటికీ నిలబెడుతూనే ఉన్నాడు. 45 ఏళ్లుగా ఎన్నో కష్టనష్టాలను, సంతోషాలను పంచుకుంటూ, మెగా ఫ్యామిలీని అందరికి ఆదర్శంగా తీర్చిదిదారు చిరంజీవి, సురేఖ. 1మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. 980 ఫిబ్రవరి 20న వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ ముగ్గురు సంతానం కలిగారు. కొడుకు, కోడలు, కూతురు అల్లుడు, మనవరాళ్లు, మనవడు, తముళ్లు, వారి పిల్లలు ఇలా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో చాలా పెద్దది. సౌత్ కపూర్స్ ఫ్యామిలీ అన్న పేరు కూడా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి కథను చాలా ఫన్నీగా చెపుతు నవ్విస్తుంటారు. '' బలికి మేకను తీసుకెళ్తున్నట్టుగా తయరు చేసిన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారని ఆయన సరదాగా అంటుంటారు. మనవూరి పాండవులు సినిమా టైమ్ నుంచి చిరంజీవిని ఓ కంట కనిపెడుతూ వచ్చారు అల్లు రామలింగయ్య.. ఆతర్వాత చాలా సినిమాలు కలిసి చేశారు. చిరంజీవికి సబంధించి ప్రతీ విషయం ఆయన నోట్ చేసుకున్నారు. కానీ అప్పుడు మెగాస్టార్ కు అల్లు రామలింగయ్య మనసులో ఏముందో తెలియదు. ''అల్లు అరవింద్, నిర్మాత జయకృష్ణ, అల్లు రామలింగయ్య.. వీరంతా కలిసి కూర్చొని ఈ కుర్రాడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. ఇవన్నీ అప్పటి దాకా నాకు తెలియదు.. జయకృష్ణ వచ్చి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకోచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. '' జయకృష్ణ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను అప్పుడే పెళ్లేంటి అని అన్నాను. నేను మంచివాడినని ఎంక్వైరీ చేసి.. నచ్చి.. ఎక్కడ చేయిజారిపోతానా అని వదిలిపెట్టకుండా తిరిగారు. మా నాన్న