
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Smart Ration Card Status Check: తెలంగాణ వ్యాప్తంగా చాలామంది స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రెండు కోట్ల 81 లక్షల మందికి రేషన్ కార్డులు ఉండగా, వీరికి అదనంగా 62 లక్షల మందిని కూడా స్మార్ట్ రేషన్ కార్డులో చేర్చారు. ఈ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు ఇతర వివరాలు ఉంటాయి. మీరు కూడా ఆన్‌లైన్‌లో మీ స్మార్ట్ రేషన్ కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేసి, అక్కడ 'FSC Search' చేయాలి. అక్కడ పాత రేషన్ కార్డు వివరాలతో లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వివరాలతో వెతకవచ్చు. మీ రేషన్ కార్డ్ డేటా కనిపిస్తే, మీకు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినట్లే. ఒకవేళ వివరాలు కనిపించకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. దాని అర్థం రేషన్ కార్డు రద్దయినట్లు కాదు. వివరాల కోసం మీ సమీపంలోని MRO లేదా MPDO కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆగస్టు 15 నుంచి 15 రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే దీని మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు, రేషన్ కార్డు నంబర్, యజమాని పేరు, షాపు వివరాలు ముద్రించబడి ఉంటాయి. కార్డు వెనుక భాగంలో హోలోగ్రామ్, యువర్ కోడ్, గ్రామం, మండలం చిరునామా వివరాలు ఉంటాయి. ఇది డిజిటల్ సమాచారాన్ని కలిగి ఉండే స్మార్ట్ రేషన్ కార్డు, తెలంగాణ