సీనియర్ నటి షకీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తన బోల్డ్ పాత్రలతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన యాక్ట్రస్ ఆమె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేశారు. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా ఆమె సినిమాలకు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేవారంటే.. షకీల క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గతేడాది 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో అలరించిన షకీల.. తాజాగా తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యను, అందుకు కారణాలను అభిమానులతో పంచుకున్నారు.ఇటీవల తన మెడకు సర్జరీ జరిగిందనే విషయాన్ని షకీలా వెల్లడించారు. అతిగా మొబైల్ వాడడం వల్లనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, నరాలు దెబ్బతినడంతో మెడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ సర్జరీకి సుమారు ₹3 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. గంటల తరబడి మంచం మీద పడుకుని ఫోన్‌లో గేమ్స్ ఆడటం, యూట్యూబ్ లో సినిమాలు చూడటం, ఇన్‌స్టాలో రీల్స్ చూడటం వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని షకీల చెప్పారు. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేసుకోవాలని, పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని ఆమె సూచించారు
Actor ProfileActor
స్మార్ట్ ఫోన్ వాడటం వల్లే మెడకు సర్జరీ.. రూ.3 లక్షల ఖర్చు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Dec 2026
స్మార్ట్ ఫోన్ వాడటం వల్లే మెడకు సర్జరీ.. రూ.3 లక్షల ఖర్చు