
ఇతర దేశాల్లో ఉత్తమ విధానాలపై అధ్యయనం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యల్లాంటి చర్యలను నియంత్రించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తేవాలా? ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి? అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలేంటనే అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించిందని తెలిపారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ‘సోషల్ మీడియా దుర్వినియోగంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వెర్రితలలు వేస్తోంది. వాటికి బాధ్యత లేదు. పాలనా వ్యవస్థ, మనుషుల ఆలోచనా విధానాన్ని మార్చేలా సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. ప్రింట్, టీవీ నెట్‌వర్క్ లాంటి సంప్రదాయ మీడియాకు చట్టపరమైన జవాబుదారీతనం, నైతిక ప్రమాణాలు ఉన్నాయి’ అని మంత్రి పేర్కొన్నారు. మహిళలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. ‘ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. దీనికోసం.. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు