సంప్రదాయాలను భావితరాలకు అందించేలా.. వేడుకగా శ్రావణ లక్ష్మీ కార్యక్రమం
Actor ProfilePolitician

సంప్రదాయాలను భావితరాలకు అందించేలా.. వేడుకగా శ్రావణ లక్ష్మీ కార్యక్రమం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంప్రదాయాలను భావితరాలకు అందించేలా.. వేడుకగా శ్రావణ లక్ష్మీ కార్యక్రమం
Eenadu15 Dec 2026
సంప్రదాయాలను భావితరాలకు అందించేలా.. వేడుకగా శ్రావణ లక్ష్మీ కార్యక్రమం

విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళామణులు ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ మొదలైంది. ఇళ్లు, ఆలయాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో సందడిగా మారాయి. సరికొత్త వినోదాలతో శ్రోతలను విశేషంగా అలరిస్తున్న ఈఎఫ్‌ఎం శ్రావణమాసానికి మరింత శోభ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. జోస్ ఆలుక్కాస్ సమర్పణలో, శుభమస్తు షాపింగ్ మాల్ కాంచీపురం, పెరుమాళ్ సిల్క్స్ సహకారంతో శ్రావణ లక్ష్మీ కార్యక్రమం నిర్వహించింది. ఈఎఫ్‌ఎం ఆధ్వర్యంలో విజయవాడ, రాజమహేంద్రవరం, వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళామణులు వరలక్ష్మీదేవి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారితో ఈఎఫ్‌ఎం ఆర్జేలు చేసిన సందడి, మాటామంతి శ్రావణ లక్ష్మీ కార్యక్రమానికి మరింత శోభను, ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈఎఫ్‌ఎం ఆర్జేలు వారితో సరదాగా మాట్లాడుతూ వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వాయనం కిట్లను అందజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని నిర్వాహకులు, మహిళా మణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమరావతిలో రాజధాని నిర్మించాలని నిర్ణయించినప్పుడు మీడియా దిగ్గజం దివంగత రామోజీ రావు తనకు ఫోన్‌ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు