సెప్టెంబర్ లో కలుద్దాం’.. ఓజీ 2’
Actor ProfileActor

సెప్టెంబర్ లో కలుద్దాం’.. ఓజీ 2’

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెప్టెంబర్ లో కలుద్దాం’.. ఓజీ 2’పై థమన్ క్రేజీ అప్ డేట్
Samayam Telugu8 Oct 2026
సెప్టెంబర్ లో కలుద్దాం’.. ఓజీ 2’పై థమన్ క్రేజీ అప్ డేట్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా OG. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది దసరాకి రిలీజైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడీ సినిమాకి పార్ట్-2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'ఓజీ 2' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అందించారు. 'ఓజీ 2' సినిమాని స్వయంగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ప్రకటించారు. ‘ఓజీ యూనివర్స్’ను విస్తరించడానికి దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ తిరిగి ఒక్కటయ్యారని ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ పేర్కొంది. పవన్ - సుజీత్ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని వెల్లడించింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యారు. 'OG 2' ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన 'హృదయం మురళి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న థమన్.. 'ఓజీ 2'పై అప్డేట్ ఇచ్చారు. ఆడిటోరియంలో ఫ్యాన్స్ అందరూ 'ఓజీ ఓజీ' అంటూ పెద్దగా అరవడంతో.. ''సెప్టెంబర్ లో కలుద్దాం'' అని థమన్ అన్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఓజీ యూనివర్స్’కు సంబంధించి ఏదైనా స్పెషల్ కంటెంట్ రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.* ‘ఓజీ 2’లో నేతాజీ.. హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే తాను కమిటైన సినిమాలను పూర్తి చేశారు. తన ఫ్రెండ్ రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక్కటి పెండింగ్ లో ఉంది. అయితే దాని కంటే ముందే 'ఓజీ 2' సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పవన్

స ప ట బర ల కల ద ద ఓజ 2 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in