సీనియర్లకు బెస్ట్ పోస్టాఫీస్ పథకం.. 3 నెలలకు ఒకసారి రూ. 50 వేలు ఇస్తారు.. ఎంత కట్టాలి? లెక్కలు
Actor ProfilePolitician

సీనియర్లకు బెస్ట్ పోస్టాఫీస్ పథకం.. 3 నెలలకు ఒకసారి రూ. 50 వేలు ఇస్తారు.. ఎంత కట్టాలి? లెక్కలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీనియర్లకు బెస్ట్ పోస్టాఫీస్ పథకం.. 3 నెలలకు ఒకసారి రూ. 50 వేలు ఇస్తారు.. ఎంత కట్టాలి? లెక్కలు
Samayam Telugu20 Oct 2026
సీనియర్లకు బెస్ట్ పోస్టాఫీస్ పథకం.. 3 నెలలకు ఒకసారి రూ. 50 వేలు ఇస్తారు.. ఎంత కట్టాలి? లెక్కలు

SCSS: పదవీ విరమణ తర్వాత ఒక్కసారిగా ఆదాయం ఆగిపోతుంది. చేతికి వచ్చే డబ్బు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, సరైనా ప్లాన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత సైతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా జీవించవచ్చు. రిటైర్ అయ్యాక ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టాఫీసు అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Saving Scheme) సరైన మార్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.20 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ పథకం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి రూ. 50 వేల వడ్డీ ఆదాయం గ్యారెంటీగా అందుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనే లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.3 నెలలకోసారి చేతికి రూ. 50 వేలుసీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పైన ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది లెక్కించవచ్చు. కావాల్సిన త్రైమాసికానికి ఒకసారి చేతికి రూ. 50 వేలు రావాలి. అంటే సంవత్సరానికి రావాల్సిన మొత్తం వడ్డీ రూ. 2,00,000 అవుతుంది. దీని ప్రకారం చూస్తే కావాల్సిన మొత్తం పెట్టుబడి రూ. 24.40 లక్షలు అవసరమవుతుంది. ఒక సీనియర్ సిటిజన్ తన ఎస్‌సీఎస్ఎస్ ఖాతాలో రూ. 24.40 లక్షలు డిపాజిట్ చేస్తే వారికి ప్రతి 3 నెలలకోసారి కచ్చితంగా రూ. 50 వేలు వడ్డీ రూపంలో ఖాతాలో జమ చేస్తారు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో మొత్తం వడ్డీ రూ. 10 లక్షలు అవుతుంది.ఎస్‌సీఎస్ఎస్ ముఖ్యమైన వివరాలుకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టాఫీసు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకానికి వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. అయితే త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. కొన్నిసార్లు

స న యర లక బ స ట ప స ట ఫ స పథక 3 న లలక ఒకస ర ర 50 వ ల ఇస త ర ఎ త కట ట ల ల క కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in