సినిమా ఫ్లాప్ ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
Actor ProfilePolitician

సినిమా ఫ్లాప్ ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమా ఫ్లాప్ ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
Sakshi22 Nov 2026
సినిమా ఫ్లాప్ ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు

తెలుగులో ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యేవి చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే తమ మూవీ ఫ్లాప్ అయింది లేదంటే జనాలకు నచ్చలేదని విషయాన్ని దర్శకులు బహిరంగంగా ఒప్పుకోరు. కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ట్వీట్ చేశాడు. పూర్తి బాధ్యత తనదేనని రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్) మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జైకృష్ణ హీరోగా చేసిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం'. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కానీ తీసికట్టు కథాకథనాల కారణంగా తొలిరోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. జైకృష్ణ యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఓల్డ్ స్కూల్ తరహా మూవీ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి ట్వీట్ చేశాడు. 'శ్రీనివాస మంగాపురం నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎన్నో భావోద్వేగాలను, మధురమైన జ్ఞాపకాలను అందించింది. వాటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. జై కృష్ణ, రషా తడానీతో పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవాళ్లనిపించలేదు. బాగా నటించారు. అశ్వనీదత్‌ గారితో కలిసి పనిచేయడం కూడా నాకు దక్కిన గొప్ప గౌరవం. కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ మూవీ ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. త్వరలోనే మళ్లీ పుంజుకుని, మీ అందరికీ నచ్చే చిత్రంతో మీ ముందుకు వస్తా' అని అజయ్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ దర్శకుడు కెరీర్ విషయానికొస్తే 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 'మహాసముద్రం'తో డిజాస్టర్ అందుకున్నాడు. మళ్లీ 'మంగళవారం' క్రేజీ మూవీ తీసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం'తో ఫెయిల్యూర్ చవిచూశాడు. కాకపోతే ఫ్లాప్ ని కూడా నిజాయతీగా అంగీకరించాడు. (ఇదీ చదవండి: ‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09