సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత
Actor ProfileActor

సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత
10TV Telugu1 Jan 2027
సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత

Ananya Raj : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే హీరోయిన్ కన్నుమూసింది. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నటించిన హీరోయిన్ అనన్య రాజ్ 35 ఏళ్ళ వయసులోనే మరణించింది. ఈ విషయాన్ని తన ఫ్యామిలీ అనన్య రాజ్ సోషల్ మీడియా ద్వారా చాలా ఆలస్యంగా వెల్లడించారు. అనన్య కుటుంబ సభ్యులు తన సోషల్ మీడియాలో అనన్య చితి ఫోటోలను షేర్ చేసి.. తీవ్రమైన దుఃఖంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. జూలై 15న అనన్య మాకు దూరమైంది. నిద్రలోనే ఆమె ప్రాణాలు విడిచింది. గత సంవత్సర కాలంగా ఆమె శారీరక, మానసిక సమస్యలతో తీవ్రంగా బాధపడుతుంది. వాటిని అధిగమించేందుకు వీర వనితలా ధైర్యంగా పోరాడింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె మాకు దూరమయింది అని తెలిపారు. Also See : Raviteja : జై సినిమా.. ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి.. మోడల్ అనన్య రాజ్ అనేక యాడ్స్ తో గుర్తింపు తెచ్చుకొని నటిగా మారింది. బాలీవుడ్‌లో 7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్.. లాంటి పలు సినిమాల్లో నటించగా తెలుగులో నవీన్ చంద్ర తగ్గేదే లే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. 35 ఏళ్ళ వయసులోనే ఆమె మరణించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఆమె అభిమానులు, నెటిజన్లు పలువురు సెలబ్రిటీలు అనన్యకు నివాళులు అర్పిస్తున్నారు

స న పర శ రమల వ ష ద 35 ఏళ ళ వయస ల న హ ర య న కన న మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in