
Soban Babu Wife Santha Kumari Died: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు దివంగత శోభన్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ వార్తతో శోభన్‌బాబు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు, మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన వెండితెర అందగాడు.. నట భూషణ్ శోభన్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు. శోభన్‌బాబు సతీమణి 86 ఏళ్ల శాంతకుమారి చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తుండేవారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. శోభన్‌బాబు సతీమణి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, శోభన్‌బాబు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శోభన్‌బాబు హీరోగా రాణించడం వెనుక శాంతకుమారి కృషి ఎంతో ఉందని గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తీవ్ర సంతాపం ప్రకటించారు. శోభన్‌బాబు, శాంతకుమారికి 1958 మే 15వ తేదీన వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సినీ రంగంలో స్థిరపడాలని ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. దీంతో చెన్నైకి పరిమితమయ్యారు. దశాబ్దాలపాటు శోభన్‌బాబు, శాంతకుమారి ఆదర్శ దాంపత్య జీవితం గడిపారు. శోభన్‌బాబు సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న సమయంలోనూ శాంతకుమారి ఎప్పుడూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయనకు అండగా నిలిచారని సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు. శోభన్‌బాబు మరణించాక అతడి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. దీంతో చెన్నైలోనే శాంతకుమారి అంత్యక్రియలు నేడు జరగనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు శోభన్‌బాబు అభిమానులు చెన్నై వెళ్లనున్నారు