
'రక్తం, నీరు కలిసి ప్రవహించవు'.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి ఇది. 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ) నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాక్ తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే, ఇలాంటి సంక్షోభాన్ని పాకిస్థాన్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 78 ఏళ్ల క్రితం, 1948లో దేశ విభజన జరిగిన కేవలం 8 నెలలకే భారత్ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో దాయాది దేశం ఎలా విలవిల్లాడిపోయిందో చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఆనాటి ఘటనలే నేటి పాక్ భయాలకు పునాది వేశాయి.1948 ఏప్రిల్ 1న ఏం జరిగింది?1948 ఏప్రిల్ 1వ తేదీ ఉదయం, లాహోర్‌కు జీవనాధారమైన అప్పర్ బారీ దోఆబ్ కెనాల్ ఒక్కసారిగా ఎండిపోయింది. పశ్చిమ పంజాబ్ (పాకిస్థాన్) వ్యవసాయ క్షేత్రాలకు ప్రాణాధారమైన ఈ కాలువలో నీటి చుక్క కరవైంది. దీంతో పాక్ ప్రభుత్వం తీవ్ర భయాందోళనలకు గురైంది. దేశ విభజన తర్వాత సింధు నదీ వ్యవస్థలోని కీలకమైన మాధోపూర్, ఫిరోజ్‌పూర్ హెడ్‌వర్క్‌లు భారత్ నియంత్రణలోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్ సాగు భూమిలో దాదాపు 5.5 శాతం ప్రాంతానికి నీరందించే కాలువలపై భారత్‌కు పూర్తి ఆధిపత్యం లభించింది. 1948 మార్చి 31తో ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక నీటి ఒప్పందం గడువు ముగియడంతో తూర్పు పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి గోపీచంద్ భార్గవ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది.నెహ్రూ వ్యతిరేకించినా ఆగని పంజాబ్ ప్రభుత్వంఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ