సౌత్ స్టార్స్ కు సెకండ్ హోమ్ గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
Actor ProfileCelebrity

సౌత్ స్టార్స్ కు సెకండ్ హోమ్ గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సౌత్ స్టార్స్ కు సెకండ్ హోమ్ గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
NTV Telugu15 Dec 2026
సౌత్ స్టార్స్ కు సెకండ్ హోమ్ గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు

ఒకప్పుడు బాలీవుడ్ ఆఫర్ల కోసమో లేదా సినిమాల ప్రమోషన్ల కోసమో దక్షిణాది నటీనటులు ముంబైకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు దుమ్మురేపుతుండటంతో ముంబై మహానగరం కూడా దక్షిణాది తారలకు మరో సొంత ఇల్లుగా మారుతోంది. బాలీవుడ్ గుండెకాయ లాంటి బాంద్రా, జూహూ, లోఖండ్‌వాలా వంటి ప్రైమ్ లోకేషన్లలో సౌత్ స్టార్స్, దర్శకులు వందల కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైలో సౌత్ స్టార్స్ లగ్జరీ ఇళ్లు – అంచనా ధర : పాన్-ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో వరుస షూటింగ్‌లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, ముంబై ఆధారిత ప్రాజెక్ట్‌ల కోసం దక్షిణాది తారలు తరచూ ముంబైలోనే సమయాన్ని గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే హోటళ్లలో ఉండటానికి బదులుగా తమదైన శైలిలో కోట్లాది రూపాయలతో లగ్జరీ పెంట్ హౌస్‌లు, డ్యూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూహూలో లగ్జరీ పెంట్ హౌస్ కోసం ప్రతినెల రూ. 16 లక్షల అద్దె చెల్లిస్తుండగా, ధనుష్ ఏకంగా రూ. 150 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసాడు. ఈ పరిణామం ఇండియన్ సినిమాలో సౌత్ స్టార్లకు పెరుగుతున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది

స త స ట ర స క స క డ హ మ గ మ బ క ట ల ద ర ప యల వ ల వ న హ స స క న గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in