
Indiramma Indlu: సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చూస్తున్న తెలంగాణ పేద ప్రజలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాబోయే సెప్టెంబర్ 15 నాటికి ప్రక్రియను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటించేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఇటీవల ప్రారంభించిన హౌసింగ్ కార్పొరేషన్, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత పనులను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 15 నాటికి అర్హులైన పేదలను గుర్తించి, వారికి అధికారికంగా మంజూరు పత్రాలు అందజేయాలనే పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఇళ్లను నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గుడిసెల్లో నివసించే వారికి తొలి ప్రాధాన్యత ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల కుటుంబాలు సరైన నివాసం లేక గుడిసెలకే పరిమితమైనట్లు తేలింది. ఈ దయనీయ స్థితిని దృష్టిలో ఉంచుకుని రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో గుడిసెల ప్రజలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్‌లోని 16 నియోజకవర్గాలను మినహాయించి, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 100 నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి 2,500 ఇళ్ల చొప్పున కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే రేకుల ఇళ్లు, బండల ఇళ్లలో నివసిస్తూ పక్కా స్లాబ్ వేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్న నిరుపేదల కోసం ప్రభుత్వం 'రూఫ్ పునఃప్రారంభం' అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రత్యేక పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 70 వేల గృహాలకు పైకప్పు (స్లాబ్) నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పేదలతో పాటు ఇల్లు ఉండి స్లాబ్ వేసుకోలేని నిరుపేదలకు కూడా ఈ కొత్త నిర్ణయం ద్వారా కొండంత ఊరట లభించనుంది. మొత్తంగా