సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో హైడ్రామా.. సభలోకి దూసుకొచ్చిన పాములు
Actor ProfilePolitician

సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో హైడ్రామా.. సభలోకి దూసుకొచ్చిన పాములు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో హైడ్రామా.. సభలోకి దూసుకొచ్చిన పాములు
Zee Telugu1 Nov 2026
సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో హైడ్రామా.. సభలోకి దూసుకొచ్చిన పాములు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jagtial Central University Video: జగిత్యాల జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న కేంద్ర విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఒక్కసారిగా తీవ్ర కలకలానికి దారితీసింది. అత్యంత ఘనంగా.. అధికారిక లాంఛనాలతో ప్రారంభమైన ఈ సభ ప్రాంగణంలోకి అకస్మాత్తుగా పాములు ప్రవేశించడంతో అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ప్రముఖులు, చాలా మంది ప్రజలు ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అంతా గందరగోళం ఏర్పడింది. విశ్వవిద్యాలయ శంకుస్థాపన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. సభ ప్రాంగణంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పాములు హంగామా సృష్టించాయి. పచ్చటి పొదల్లోంచి బయటకు వచ్చిన సర్పాలు వేదిక సమీపంలోకి రావడంతో అక్కడ గందరగోళ సరిస్థితులు ఏర్పడ్డాయి.. భయంతో పరుగులు.. పాములు ప్రత్యక్షం కావడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళ నెలకొంది. కుర్చీల్లో కూర్చున్న స్థానికులు భయంతో అటుఇటు పరుగులు తీశారు. అప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న సభలో ఏం జరుగుతుందో తెలియక అక్కడే ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాములు ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలియక అందరిలోనూ తీవ్ర

స ట రల య న వర స ట శ క స థ పనల హ డ ర మ సభల క ద స క చ చ న ప మ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in