సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే
Actor ProfileActor

సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే
TV9 Telugu26 Sept 2026
సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే

టీ20 ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, జట్టులోకి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే, సంజూ తుది జట్టులోకి వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ వేటు వేయబోయే ఆ కీలక ఆటగాడు ఎవరో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం కోసం, ఏకంగా ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడనే కారణంతో భారత్‌కు మూడో ప్రపంచకప్ అందించిన స్టార్ ఆటగాడిని పక్కన పెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భారత తుది జట్టును పరిశీలిస్తే అగ్ర వరుసలోని ఏడుగురు బ్యాటర్లలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఇలా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లే ఉన్నారు. ఒకే శైలి కలిగిన ఆటగాళ్లు వరుసగా ఉండటం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ మార్చాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఇది బౌలర్ల పనిని మరింత సులువు చేస్తోంది. ఈ తరుణంలో కుడిచేతి వాటం కలిగిన సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మిడిల్ ఆర్డర్‌లో సమతుల్యత వస్తుంది. రెండో టీ20కి ముందు తిలక్ వర్మపై వేటు పడుతుందని భావించినప్పటికీ, అతను 11 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టుకు మంచి ముగింపునిచ్చాడు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఇషాన్ కిషన్‌పైనే పడ్డాయి. ఈ