సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా
Actor ProfilePolitician

సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా
Namasthe Telangana25 Dec 2026
సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా

Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు పోరాట యోధుల గురించి తలచుకుంటారు.. స్వాతంత్య్రోద్యమ ఫలితాల గురించి మాట్లాడుతారు.. ఏ ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి అయినా కూడా దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారు..కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా ఎవరూ ఉండరేమో అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు.. గోబెల్స్ ప్రచారం.. ముఖ్యమంత్రి 4:20 నిమిషాలకు ఉపన్యాసం ప్రారంభించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు.. రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మండిపడ్డారు. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినవ్‌.. ఒక్కమాట ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించో,, సంగారెడ్డి గురించో మాట్లాడినవా.. ? సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..? నీ ప్రభుత్వం తప్పిదం, నీ చేతగాని తనం వల్ల సింగూరు ఖాళీ చేసినవ్‌. మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఇవాళ మంచినీళ్లు లేవు. నారాయణ ఖేడ్‌లో రెండు రోజులకోసారి నల్లా వస్తుంది. కరువు కాలంలో కూడా ఎండాకాలంలో కేసీఆర్ తండాతండాకు రాష్ట్రం మొత్తం మంచినీళ్లు ఇస్తే.. నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినవ్‌. పోని రిపేర్‌ అన్నా చేస్తవా అంటే అది కూడా చేయలేదన్నారు. నేడు సింగూరులో నీళ్లు లేక