సింగ్ గీతం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది
Actor ProfileCelebrity

సింగ్ గీతం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింగ్ గీతం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది
AP7AM24 Sept 2026
సింగ్ గీతం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది

సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ప్రయోగాత్మక మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సంగీతం' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా జూలై 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు రానుండటం గమనార్హం.జూన్ 11, 12 తేదీల్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం, వినూత్న కథనంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సంగీతం, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయాన్, అహల్య, షాలిని ప్రధాన పాత్రలు పోషించగా, నాగ్ అశ్విన్ తన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, కేవీ అనుదీప్, రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ అతిథి పాత్రల్లో మెరిశారు.తండ్రి ఆస్తుల కోసం కుబేరపురం అనే మైనింగ్ టౌన్‌కు వెళ్లిన కథానాయకుడు, అక్కడ మాటలు పాటలుగా మారే ఓ విచిత్రమైన శాపం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఓటీటీ వెర్షన్ కోసం క్లైమాక్స్ విజువల్స్‌ను మరింత మెరుగుపరిచారని వార్తలు వస్తున్నాయి. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

స గ గ త ఇప ప డ ఓట ట ల క వచ చ స త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in