సింగరేణి సిగలో తాడిచర్ల
Actor ProfilePolitician

సింగరేణి సిగలో తాడిచర్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింగరేణి సిగలో తాడిచర్ల-2.. పార్టీల క్రెడిట్ ఫైట్
Telugu Times9 Oct 2026
సింగరేణి సిగలో తాడిచర్ల-2.. పార్టీల క్రెడిట్ ఫైట్

తెలంగాణ ప్రజల, సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ నెరవేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన తాడిచర్ల బొగ్గు బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వేలం లేకుండానే నేరుగా ఈ మైన్‌ను కేటాయించడం సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే, ఈ కేటాయింపు ప్రకటన వెలువడిన క్షణం నుంచే తెలంగాణ రాజకీయాల్లో ‘క్రెడిట్ వార్’ ముదిరింది. “ఇది మా వల్లే సాధ్యమైంది” అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేటాయింపులు చేసిన బీజేపీ నేతలు పోటాపోటీగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. గోదావరి లోయ బొగ్గు గనుల పరిధిలోని ములుగు కోల్ బెల్ట్ వాయువ్య ప్రాంతంలో తాడిచర్ల బ్లాక్-2 విస్తరించి ఉంది. దాదాపు 1,875 హెక్టార్ల పరిధిలో విస్తరించిన ఈ బ్లాక్‌లో భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ బ్లాక్‌లో దాదాపు 182 మిలియన్ టన్నుల నుంచి 434 మిలియన్ టన్నుల వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇందులో లభించే బొగ్గు అత్యంత నాణ్యమైన జీ-8, జీ-9 గ్రేడ్‌కు చెందినది. ఇది ఎన్టీపీసీ, కేటీపీపీ వంటి భారీ విద్యుత్ కేంద్రాలకు ఎంతో అనుకూలం. ఈ గని ద్వారా ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల బొగ్గును 40-50 ఏళ్ల పాటు ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం, సుమారు 1,200 నుండి 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో తాడిచర్ల బ్లాక్-1ను టీజీ జెన్కోకు కేటాయించగా, బ్లాక్-2 కోసం కూడా జెన్కో ప్రయత్నించింది. కానీ, అంతిమంగా కేంద్రం దీన్ని సింగరేణికే దక్కేలా చేసింది. ఈ కేటాయింపు ఫైలుపై ప్రధాని నరేంద్ర మోడీ అనుమతితో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంతకం చేశారు. 2020 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా నేరుగా గనులు కేటాయించే పద్ధతి