సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా
Actor ProfileActor

సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా
123Telugu29 Nov 2026
సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి దాదాపు రూ. 120 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో తమ బ్యానర్‌లో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం జనవరి 12న విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో, అదే సెంటిమెంట్‌తో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని కూడా జనవరి 12, 2027న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాతో సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట డిసెంబర్ 2026లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, సంక్రాంతి సీజన్ అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి

స క ర త ర స ల స య ధరమ త జ న జమ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in