సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్
Actor ProfileActor

సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్
123Telugu25 Dec 2026
సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రెస్టిజియస్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో 2027 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన ఇంటెన్స్ అండ్ రస్టిక్ లుక్ ప్రేక్షకులను, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రేసులో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పండుగ సీజన్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు

స క ర త బర ల స బర ల ఏట గట ట ర ల జ డ ట ఫ క స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in