
రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ సినిమాతోనే సుకుమార్ కమర్షియల్ సినిమాల పంథాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక రామ్ చరణ్ ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ లో నటించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఐతే, ఆ తర్వాత చరణ్ కి ఆ స్థాయిలో సోలో హీరో హిట్ రాలేదు. అందుకే, ఇపుడు వీరి కొత్త కాంబినేషన్ (RC17)పై అందరి చూపు ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 15 కిలోలు తగ్గుతాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ‘పెద్ది’ సినిమా కోసం బరువు పెరిగాడు. ఆ బరువు తగ్గించుకుంటాడట. అలాగే జుట్టుని చాలా పొడుగ్గా పెంచుకొని కనిపిస్తాడట. హెయిర్ స్టైల్ ఈ సారి డిఫెరెంట్ గా ఉంటుంది అని తెలుస్తోంది. ఇటీవల మోచేతికి సర్జరీ చేయించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. ఇక సుకుమార్ తన స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరు పరిశీలనలో ఉంది