స్కాన్ చెయ్ .. పాఠం చదివేయ్
Actor ProfilePolitician

స్కాన్ చెయ్ .. పాఠం చదివేయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్కాన్ చెయ్ .. పాఠం చదివేయ్
Eenadu24 Nov 2026
స్కాన్ చెయ్ .. పాఠం చదివేయ్

కొయ్యూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. తరగతిలో చెప్పిన పాఠాలను కొంతమంది పిల్లలు వెంటనే అర్థం చేసుకోలేరు. మరికొంత మంది బడికి వెళ్లకుంటే వెనుకబడే అవకాశం ఉంది. పాఠాలు అర్థం కాకపోయినా, సందేహాలున్నా కొందరు పిల్లలు అడగలేరు. దీని కోసం ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పుస్తకాలపై ఈ సదుపాయం ఉంటుంది. సరళ విధానంలో ఉండటంతో పిల్లలు ఆసక్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. చరవాణి ఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకునే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. చరవాణిలో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సంబంధిత వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. పుస్తకాలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే అంశాల వారీగా కనిపిస్తాయి. వీటిని స్కాన్‌ చేయడం ద్వారా ఆడియో, వీడియో రూపంలో పాఠం వినొచ్చు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

స క న చ య ప ఠ చద వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in