సాంకేతిక ఆవిష్కరణలతో వికసిత భారత్
Actor ProfilePolitician

సాంకేతిక ఆవిష్కరణలతో వికసిత భారత్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాంకేతిక ఆవిష్కరణలతో వికసిత భారత్
Eenadu29 Oct 2026
సాంకేతిక ఆవిష్కరణలతో వికసిత భారత్

కోర్‌ టెక్నాలజీ వైపు దేశం అడుగులు కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణ పురోగతి, పూర్తి అయిన తర్వాత ఎలా ఉంటుందో చిత్రాలు చూపుతున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈనాడు బిజినెస్‌ బ్యూరో, హైదరాబాద్‌: దేశీయంగా సాంకేతిక రంగం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోందని, వికసిత భారత్‌-2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో హైదరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఐటీ, రైల్వే, గనుల శాఖల మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ‘వికసిత్‌ భారత్‌-2047- సాంకేతికత పాత్ర’ అంశంపై ఐటీ పరిశ్రమ వర్గాలతో మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో హైసియా అధ్యక్షుడు బిపిన్‌ పెండ్యాల, టీసీఎస్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న, హెచ్‌సీఎల్‌ టెక్‌ గ్లోబల్‌ జీసీసీ బిజినెస్‌ హెడ్‌ కిరణ్‌ చెరుకూరి, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొనగా మంత్రులు ప్రసంగించారు... ఇప్పటిదాకా సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌(సాస్‌)గా ఉన్న ఐటీ పరిశ్రమ.. ఇకపై ఏఐ(కృత్రిమ మేధ) యాజ్‌ ఏ సర్వీస్‌ దిశగా వేగంగా పయనించాలి. దేశంలో 12 సెమీకండక్టర్‌ ప్లాంట్లు వివిధ దశల్లో ఉన్నాయి. 3 ప్లాంట్లలో చిప్స్‌ తయారీ ప్రారంభమైంది. అంతర్జాతీయంగా సెమీకండక్టర్‌ రంగంలో 10 లక్షల మంది నిపుణుల కొరత ఉంది. గతేడాది దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ విలువ రూ.13 లక్షల కోట్లు కాగా, త్వరలో రూ.20 లక్షల కోట్లకు చేరనుంది. హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను వివిధ వాతావరణాల్లో పరీక్షించుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ‘కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌(సీఎఫ్‌ఎస్‌)’ ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్‌ రైలు కారిడార్లను మంజూరు చేయగా హైదరాబాద్‌ మూడింటిని దక్కించుకుంది. బుల్లెట్‌ రైళ్ల ద్వారా హైదరాబాద్‌ నుంచి అమరావతికి 70 నిమిషాలు, బెంగళూరుకు 2.35 గంటలు, పుణెకు 123 నిమిషాలు, చెన్నైకు 3 గంటల్లోనే చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నాం. నాంపల్లి స్టేషన్‌ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. బేగంపేట

స క త క ఆవ ష కరణలత వ కస త భ రత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in