
అమృతలూరు: కొల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.7,38,845 ఆర్థిక సహాయం మంజూరైంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితుల వైద్య ఖర్చుల బిల్లులను వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎం సహాయనిధి కార్యాలయానికి పంపించారు. సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.7,38,845 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు స్వయంగా లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించి, ఆపద సమయంలో వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు