సీఎం విజయ్ కి మద్రాసు హైకోర్టు నోటీసులు
Actor ProfilePolitician

సీఎం విజయ్ కి మద్రాసు హైకోర్టు నోటీసులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం విజయ్ కి మద్రాసు హైకోర్టు నోటీసులు
Andhra Jyothy3 Oct 2026
సీఎం విజయ్ కి మద్రాసు హైకోర్టు నోటీసులు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. క్రీడా శాఖ మంత్రి ఆదవ్ అర్జున సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ ఏకసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్లలో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను వారం రోజుల్లోగా సరిదిద్దాలని హైకోర్టు పిటిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునకు 3 వారాల గడువిస్తూ రిజిస్ట్రీ నోటీసులు జారీ చేయనున్నారు. ఎన్నికల పిటిషన్ల విచారణను అత్యంత వేగంగా.. ఆరు నెలలలోపే పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, నామినేషన్ అఫిడవిట్‌లో పెండింగ్ కేసుల వివరాలు దాచారని, ఎన్నికల ఖర్చులను పూర్తిగా చూపలేదని విజయ్‌పై డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో చట్ట విరుద్ధంగా చిన్నపిల్లలను ఉపయోగించుకున్నారంటూ ఇనిగో తన పిటిషన్‌లో ప్రస్తావించారు. విజయ్ విజయాన్ని రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని, అలాగే తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికపై స్టే విధించాలని డీఎంకే అభ్యర్థి ఇనిగో కోరారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు: శ్రీనివాసానంద సరస్వతి టెక్నాలజీని దుర్వినియోగం చేశారు.. ఫిఫాపై క్రొయేషియా ఫిర్యాదు