సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఆ మాట ఏమైంది..? మూడేళ్లుగా ఉపాధ్యాయుల కన్నీటి ఆవేదన
Actor ProfilePolitician

సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఆ మాట ఏమైంది..? మూడేళ్లుగా ఉపాధ్యాయుల కన్నీటి ఆవేదన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఆ మాట ఏమైంది..? మూడేళ్లుగా ఉపాధ్యాయుల కన్నీటి ఆవేదన
Zee Telugu27 Oct 2026
సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఆ మాట ఏమైంది..? మూడేళ్లుగా ఉపాధ్యాయుల కన్నీటి ఆవేదన

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. GO 317 Teachers Issue: గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను తమ సొంత జిల్లాల నుంచి వేరే జోన్లకు పంపించిన ‘జీవో 317’ (GO 317)పై బాధిత ఉపాధ్యాయుల గోస ఇంకా తీరడం లేదు. నాటి ప్రభుత్వం తెచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల ఎంతోమంది ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయారని GO 317 & 190 టీచర్స్ జస్టిస్ ఫోరం అధ్యక్షురాలు రత్నమాల చెబుతున్నారు. ఈ చీకటి జీవోకు వ్యతిరేకంగా సుమారు 16 సార్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించి, ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై ఉపాధ్యాయ లోకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాగానే కేవలం 48 గంటల్లోనే జీవో 317 సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. "నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నమ్మిన GO 317 బాధితులు.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల ద్వారా కాంగ్రెస్ గెలుపొందేలా శాయ శక్తుల కృషి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం GO 317 పైన సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీకి అధ్యక్షులుగా దామోదర రాజ నరసింహ, సభ్యులుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబును నియమించారు. ఆ కమిటీ కూడా సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు చాలా కాలయాపన చేసింది. దీంతో విసిగిపోయిన GO 317 బాధితులు అక్టోబర్ 2వ తేదీన గాంధీ భవన్ ముట్టడి చేశారు. 317

స ఎ ర వ త ర డ డ గ ర ఆ మ ట ఏమ ద మ డ ళ ల గ ఉప ధ య య ల కన న ట ఆవ దన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in