
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని వికాసం నుంచి వైభవం వైపు, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తున్నామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు."భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్ర్యం. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు కన్న కలలను సాకారం చేసి, 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడదాం. ఈ దేశానికి మనమేం ఇవ్వగలమని ఆలోచించడమే ‘అనే నేను...’ సంకల్పం. రాబోయే 20 ఏళ్లు దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్, మనం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేర్వేరు కావు. ఐక్యంగా ఈ లక్ష్యాలను సాధిద్దాం" అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.గత పాలన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపుగత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా విధ్వంసానికి గురైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గత పాలకుల అహంకారం, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించాం. గత