సర్’ దెబ్బకు వణుకుతున్న ఓవైసీ ఫ్యామిలీ
Actor ProfilePolitician

సర్’ దెబ్బకు వణుకుతున్న ఓవైసీ ఫ్యామిలీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సర్’ దెబ్బకు వణుకుతున్న ఓవైసీ ఫ్యామిలీ
Telugu Times7 Nov 2026
సర్’ దెబ్బకు వణుకుతున్న ఓవైసీ ఫ్యామిలీ

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో సాగుతున్న ఓటర్ల స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర రాజకీయ కాక రేపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన, దశాబ్దాలుగా పాతబస్తీని తమ రాజకీయ సామ్రాజ్యంగా ఏలుతున్న మజ్లిస్ పార్టీకి, ముఖ్యంగా ఓవైసీ కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో నకిలీ ఓట్లు, అక్రమ ఓట్ల వ్యవహారం ఈ ప్రత్యేక తనిఖీలతో వెలుగులోకి రాబోతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జోరందుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా వంటి పాతబస్తీ నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల్లోనూ అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సగటు ఓటింగ్ 45శాతం నుండి 50శాతం లోపే ఉండటానికి ప్రధాన కారణం ఓటర్ల జాబితాలోని అడ్డగోలు లోపాలేనని ఈ నిరంతర తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బూత్ లెవెల్ అధికారులు కేవలం ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఒక సాధారణ గుర్తింపు పత్రాన్ని చూసి ఓట్లు నమోదు చేసేవారు. దీనివల్ల ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, చనిపోయిన వారి పేర్లు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి ఓట్లు కూడా జాబితాలో అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత కఠినమైన ‘స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్’లో అధికారులు పౌరసత్వం, స్థానికతను నిరూపించుకోవడానికి దశాబ్దాల నాటి మున్సిపల్ అసెస్‌మెంట్ రసీదులు, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ వంటి పక్కా లీగల్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. పాతబస్తీలో తరతరాలుగా నివసిస్తున్న మెజారిటీ ముస్లిం పేద కుటుంబాలు అద్దె ఇళ్లలోనో, సరైన పత్రాలు లేని పాత ఇళ్లలోనో ఉంటుండటంతో ఈ పత్రాలు చూపించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి పాతబస్తీలో భారీ సంఖ్యలో బోగస్, బల్క్ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఓట్ల గల్లంతు భయం వెనుక ఎంఐఎం పార్టీ ఉనికికి సంబంధించిన పెద్ద రాజకీయ