సర్కారీ బడుల విద్యార్థుల కంటే మంత్రుల
Actor ProfilePolitician

సర్కారీ బడుల విద్యార్థుల కంటే మంత్రుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సర్కారీ బడుల విద్యార్థుల కంటే మంత్రుల
Andhra Jyothy24 Jan 2027
సర్కారీ బడుల విద్యార్థుల కంటే మంత్రుల

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్‌ జనతా పార్టీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్‌, ఆగస్ట్‌ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్‌ జనతా పార్టీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్‌ స్కూల్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు